సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫై రోడ్డు ఫై జరిగిన దాడి , ఇంటిపై దాడి తదుపరి అంబటి అరెస్ట్ నేపథ్యంలో…తాడేపల్లి నుంచి నేటి బుధవారం ఉదయం 11గంటలకు బయల్దేరిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సాయంత్రం వేళ అంబటి నివాసానికి చేరుకున్నారు. కిలో మీటర్లు మేర దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, భారీగా తరలి రావడంతో పర్యటన ఆలస్యమైంది. మార్గ మధ్యలో జగన్‌ను చూసేందుకు ఇతర ప్రాంతాల నుండి కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు. దీనితో గుంటూరు ప్రధాన రోడ్లు మార్గాలు జనసంద్రంగా మారాయి. పోలీసులు జగన్ భద్రతకు అభిమానులను వారించడానికి చాల శ్రమ పడవలసి వచ్చింది. చాలా చోట్ల కార్యకర్తలు చుట్టుముట్టడంతో కాన్వాయ్ ఆపి అభివాదం చేశారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులకు జగన్ పరామర్శించారు. అక్కడ జగన్ మీడియా తో మాట్లాడుతూ.. తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుడు ప్రచారం నుండి ప్రజల ను డైవర్షన్ చెయ్యడానికి ఒక పధకం ప్రకారం గత 3 రోజులుగా మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి, జోగి రమేష్ లపై జరిగిన దాడులఫై జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.
