సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు,తీవ్ర స్థాయిలో ఖండించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశా రు.‘‘ఆంధ్రజ్యోతి ఎండీ ఏం నేరం చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు? తన మిత్రుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో సోదాల కు సీఐడీ అధికారులు వెళ్తే అక్కడకు వెళ్లడం తప్పా? సీఐడీ అధికారుల సమక్షంలోనే లక్ష్మీనారాయణతో రా ధాకృష్ణ మాట్లాడారు. అదేమైనా నేరమా? తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారు. 30 గంటల తర్వా త కేసు నమోదు చేయడం రాధాకృష్ణతో పాటు ఏబీఎన్‌ సిబ్బందిపై కేసు నమోదు చేయడం వైసీపీ సర్కారు ఉన్మాదానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడమే లక్ష్యంగా జగ న్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని, వైసీపీ నేతలు చెప్పినట్లు చేస్తూ సీఐడీ అధికారులు ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మంటగలుపుతున్నా రు అని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *