సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, మంగళవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమవరం ఎంపీపీ పేరిచర్ల నరసింహరాజు మాట్లాడుతూ.. జనసేన నేతలు తాడేరు వంతెన కోసం పాదయాత్ర అంటూ చేస్తున్న జిమ్మిక్కులు మానుకోవాలని ఎందుకంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న ‘జనసేన’ చినబాబు 2016లో తెలుగుదేశం పార్టీలో భీమవరం పట్టాన చైర్మన్ గా ఉన్నపుడే ఈ తాడేరు వంతెన దుర్భర పరిస్థితి గురించి అప్పటి వైసిపి కౌన్సెలర్స్ ( అప్పటిలోనే వెంప వెళుతూ దారిలో గ్రంధి శ్రీనివాస్ తాను తాడేరు వంతెనను పరిశీలించాక .. తాను స్వయంగా.. అప్పుడు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు చూపెడుతూ.. ) తాడేరు నూతన వంతెన కోసం విజ్ఞప్తి చేస్తే చైర్మెన్ చినబాబు కానీ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోకుండా కాలయాపన చేసారని, అక్కడి ప్రజలు వారితో విసిగిపోయి 2019 లో గ్రంధి శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చారని దానితో సీఎం జగన్ దృష్టికి తీసుకోని వెళ్లి 1కోటి 90 లక్షలు నిధులు మంజూరు చేయించారని , అయితే 9 సార్లు టెండర్లు పిలిచినా ఎవరు రాలేదని, దానితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి ప్రతిపాదనలు పంపి 2కోట్ల 60 కోట్ల నిధులు మంజూరు చేయించారని మరో ఏడాది లో వంతెన పూర్తీ చేసి ఆ కార్యక్రమానికి జనసేన వారిని పిలుస్తామని, మీ హయాంలో పూర్తీ కానీ యన్మదురు కాలువపై 3 వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 36 కోట్ల నిధులు మంజూరు , భయానక ఏరియాగా మార్చేసిన భీమవరం 2 టౌన్ బస్టాండ్ పునః ప్రారంభము, పట్టణంలో రోడ్ల ఆక్రమణలు తొలగింపు, ట్రాఫిక్ నియంతరణ, పట్టాన సుందరీకరణ చేస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు మీ చేతకాని తనాన్నిఅంటకట్టే ప్రయత్నాలు, మీ పార్టీ క్రేజ్ కోసం జిమ్మిక్కులు మానుకోవాలని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *