సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం పట్టణ శివారు లోని తాడేరు వంతెన నిర్మాణం పూర్తీ అయ్యింది. భీమవరం మండలం లోని అనేక గ్రామాలకు పట్టణంలోకి రావడానికి అనుసంధానం గా .. పూర్వము 1929లో నిర్మించిన ఈ శిధిలమైన పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించి ఇస్తానని ఎన్నికల హామీగా ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 9 సార్లు టెండర్ దారులు కాంట్రాక్టర్స్ వెనక్కి తగ్గిన .. అంచనాలు పెంచి రూ.2.కోట్ల 30లక్షల నిధులు మంజూరు చేయించి అనేక అడ్డంకులు అధిగమించి తన హామీ నిలబెట్టుకున్నారు. వంతెన నిర్మా ణ పనులకు ఈ ఏడాది ఏప్రిల్ 4న శంకుస్థాపన జరగ్గా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నిర్మాణ పనులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ నాలుగు నెలల వ్యవధిలోనే పనులను పూర్తిచేయించి తాజగా ట్రయల్ రన్ ప్రారంభించారు. అతి త్వరలో అధికారికంగా వంతెనను ప్రారంభించనున్నారు. కొత్త వంతెన ఫై రాకపోకలు ప్రారంభం కావడంతో భీమవరం మండలంలోని గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
