సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు లో శరవేగంగా నిర్మిస్తున్న తాడేరు నూతన వంతెన నిర్మాణ పనులు ను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, గురువారం దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ వంతెన మీదుగా వెళ్లే సమయంలో వంతెనను పరిశీలించడం జరిగిందని అన్నారు. గత 10ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యం వల్ల వంతెన రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరుకుందని గుర్తించామని, ఈ వంతెన పై పెద్దపెద్ద వాహనాలు రాకపోకలు సాగిస్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఉంటుందని భావించి వెంటనే వంతెన పై నుండి పెద్ద వాహనాలు వెళ్లకుండా గెడ్డర్లను ,ఇనుప చట్రాన్ని వంతెన కు బిగించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా వంతెన నిర్మాణ పనులకు సంబంధించి రూ కోటి 90 లక్షల నిధులను మంజూరు చేయించి, 9 సార్లు టెండర్లు పిలిచామని అన్నారు. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరోసారి అంచనాలను రూ 2 కోట్ల 30 లక్షల పెంచి ప్రతిపాదనలు చేసి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం వంతెన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు చూస్తే ఎనమదుర్రు డ్రై న్ పై నాలుగు వంతెనల నిర్మాణానికి శ్రీకారం చట్టడం జరిగిందని అన్నారు. అదే మాదిరిగా నాగిడిపాలెం, డేగాపురం, ఎల్ వి ఎన్ పురం, గరగపర్రు, భీమవరంలో బైపాస్ రోడ్డులో ఎనమదుర్రు డ్రై న్ పై వంతెన, వేండ్రలో వంతెన, 11 వంతెనలను కేవలం ఐదేళ్ల కాలంలో ఆనాడు నిర్మించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆనాడు 82 ఎకరాల భూమిని సేకరించి టిడ్కో పథకంలో లబ్ధిదారులకు గృహాలను నిర్మించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో సుమారుగా 300 ఎకరాల భూములను సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గత పాలకులు ఎనమదుర్రు డ్రై న్ పై నిరుపయోగంగా నిర్మించిన సగం సగం పనులు చేసి వదిలేసిన వంతెనలకు అప్రోచ్ రోడ్డులు నిర్మాణం నిమిత్తం తాను సీఎం జగన్ దృష్టికి తెచ్చి 36 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని, త్వరలోనే ఆ పనులకు టెండర్లు పిలుస్తారని అన్నారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించడంతో పాటుగా, ఆ ఆసుపత్రి నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమిని సొంతంగా కొనుగోలు చేసి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు. తాను నిత్యం భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానని ప్రకటించారు,
