సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భర్తలను హత్య చెయ్యడానికి వారి భార్యలు చేస్తున్న అరాచకాలు వరుసగా మీడియాలో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఇటీవల కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఇటీవల విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకుందామనే నెపంతో భర్తను కృష్ణానదిలోకి తోసేసిందన్న ఆరోపణలు ఒక భార్యపై వచ్చాయి. నది ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, తాతప్ప ఒక బండరాయిని పట్టుకుని కేకలు వేశాడు.తనకు ఈత వచ్చునని తెలియక తన భార్యే నదిలో త్రోసేసిందని ఆరోపించాడు. ఈ వీడియోలు దాదాపు అందరు చూసే ఉంటారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మరో భారీ ట్విస్ట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. తాతప్ప ప్రాణాలతో బయటపడిన తర్వాత తన భార్య తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ అని, ఆమెకు 16 సంవత్సరాలు కూడా నిండలేదని బాలల హక్కుల కమిషన్ గుర్తించింది. దీంతో తాతప్ప మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడని నిర్ధారించిన అధికారులు, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు తాతప్పపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మైనర్ కాబ్బటి ఆ అమ్మాయి చేసిన హత్య యత్నం పెద్ద నేరం కాదు.. పోక్సో లో ఇరుకున్న భర్తను ఎవరు కాపాడతారో?
