సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జనసేన నాయకులు, భీమవరం కౌన్సిల్ మాజీ ప్లోర్ లీడర్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు (తాతరాజు) ఆకస్మిక మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు పరామర్శించి తాతారాజు సేవలకు నివాళ్లు అర్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేడు, శనివారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తాత రాజు తండ్రిగారిని పరామర్శించారు. ఒక ఆత్మీయుడిని కోల్పోయమని, , ఆయన భౌతికంగా లేకపోయినా అందరి మధ్యలో ఎప్పటికీ ఉంటారని, తాతారాజు జనసేన పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని, ఆయన లేకపోవడం పార్టీకి తీరని లోటని ఆయనకు నివాళిలర్పించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, పొత్తూరి బాపిరాజు, మాజీ టీడీపీ కౌన్సిలర్ పంతం సతీష్ లు తాతరాజు కుటుంబ సభ్యులును పరామర్శించారు.
