సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఇప్పటి యువతరం ఫ్యాషన్ ఐ కాన్ గా మారుతున్నా సిద్దు జొన్నలగడ్డ ‘డీజీ టిల్లు’1 సినిమా అతని సహజసిద్ధమైన నటన,ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు..తెలుగు ప్రేక్షకుల్లో టిల్లు అనేవాడు భాగం అయిపోయాడు అనే చెప్పాలి, ఆ పాత్రని హైలైట్ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకుడు.. అయితే దానికి స్వీక్వెల్ గా దాదాపు రెండేళ్లు తరువాత ‘టిల్లు స్క్వేర్’…పేరుతొ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీనికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. కథ, మాటలు మాత్రం హీరో సిద్దు యే రాయడం విశేషం. మరి ఈ సినిమా కధ విషయానికి వస్తే.. డీజీ టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) ఇప్పుడు టిల్లు ఈవెంట్స్ అని వెడ్డింగ్ ప్లానర్, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు ఒక ఈవెంట్ లో లిల్లి (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వెంటనే టిల్లు ఆమెకి పడిపోతాడు, ఆమెతో ఒకరోజు వుంటాడు. తెల్లవారేసరికి ఆమె ఒక వుత్తరం పెట్టి మాయం అవుతుంది. టిల్లు ఆమెకోసం వెతుకుతూ ఉంటాడు, నెలరోజుల తరువాత ఒకరోజు ఆసుపత్రి దగ్గర లిల్లి కనపడుతుంది. తాను ప్రేగ్నంట్ అని, అందుకు టిల్లునే కారణమని చెపుతుంది. టిల్లు తల్లిదండ్రులు కూడా చేసుకోమని చెప్తారు, వేరే దారిలేక లిల్లిని పెళ్లి చేసుకుంటాను అంటాడు ఇక్కడ నుండి కథ లో ఎన్నో ట్విస్ట్ లు.. క్రైమ్ కూడా మిక్సింగ్ అవుతుంది. అంతర్జాతీయ డాన్ (మురళి శర్మ) హైదరాబాదు ఎందుకు వస్తున్నాడు? అతనికి టిల్లుకి ఏంటి సంబంధం? టిల్లు పుట్టినరోజునాడు ఎందుకు అలా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు? ఇవన్నీ తెలియాలంటే గమ్మత్తుగా ఉండే ‘టిల్లు స్క్వేర్’ సినిమా చూడాల్సిందే. ఇక సినిమా లో పాత్రదారులు అందరు బాగా నటించారు. హీరో సిద్దు జొన్నలగడ్డ డీజీ టిల్లు’ అనే సినిమాతో ఎంతగా పేరు తెచ్చుకున్నాడో దానికి కొనసాగింపుగా అంతకు మించిన పేరు ఈ సినిమా తో సాధిస్తాడని చెప్పవచ్చు.. అవలీలగా తాను నవ్వకుండా ప్రేక్షకులను నవ్వించే గమ్మత్తయిన టిల్లు విభిన్న మ్యానరిజమ్స్ డైలాగ్ డెలివరీ కి నిజంగా తోపు అనిపించాడు. గత సినిమాలకు భిన్నమైన కాస్త నెగిటివ్ టచ్ ఉన్న హీరోయిన్ పాత్రలో అనుపమ హద్దులు దాటి.. చెలరేగి యువతకు గుచ్చుకునేలా నటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. లాజిక్ లు ఆలోచించకుండా చుస్తే.. కేవలం 2 గంటల నిడివితో ఉన్న ఈ సినిమా వినోదం లో ప్రేక్షకులను చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తుంది..
రామ్ మిరియాల సంగీతంలో ఇచ్చిన పాటలు అన్నీ మంచి క్యాచీ గా ఉన్నాయి. ఫోటోగ్రఫి ఓకె .. మొత్తానికి, సిద్దు కు మరో హిట్ పడింది..
