సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం తెల్లవారు జామున తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న భోగవల్లి వీర వెంకట సతీష్ (40), ఆయన భార్య భోగవల్లి కిరణ్మయి (36) నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానిక గ్రామస్తులు వెంటనే అందులోని వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే భార్యాభర్తలు చనిపోగా.. కారు వెనుక సీట్లో ఉన్న వృద్ధ దంపతులు, ఇద్దరు చిన్నపిల్లలను మాత్రం రక్షించగలిగారు. పోలీసులు రంగంలోకి దిగి క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
