సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మ డి ఉభయ గోదావరి జిల్లాలల్లో పలుచోట్ల దొంగతనాలకు పాల్ప డిన నిందితుడిని రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్ దిశ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తణుకు పట్టణానికి చెందిన యడ్ల నవీన్ ప్రసాద్ అలియాస్ రెడ్డి అనే నిందితుడు గురించి వివరిస్తూ.. గోదావరి జిల్లాలలో తాళం వేసిన ఇళ్లే అతడి లక్ష్యం. పగల రెక్కి నిర్వహస్తాడు.. రాత్రికి వచ్చి ఆ ఇంట్లో చోరీ చేస్తాడు. ఇలా పది నెలల్లో 18 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఉమ్మ డి ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడిన నిందితుడిని ఇటీవల ఉండ్రాజవరం పోలీసులు ఓ దొంగతనం కేసులో నిందితుడిగా అరెస్టు చేశారు. పనిచేసుకొని బ్రతకటం ఇష్టంలేని ఇతడు ఈ ఏడాది జనవరి నుంచి చోరీలు మొదలుపెట్టాడు. ఉండ్రాజవరం స్టేషన్ పరిధిలో ఆరు, తణుకు పట్టణం లో మూడు, గ్రామీణంలో రెండు, కొవ్వూ రు స్టేషన్ పరిధిలో ఒకటి, అమలాపురం పట్టణంలో నాలుగు, గ్రామీణం పరిధిలో రెం డు చోరీలు చేశాడు. నిందితుడి నుం చి 458 గ్రాముల బంగారం , 590గ్రాముల వెండి వస్తువులతోపాటు రూ.30 వేలు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వా ధీనం చేసుకున్నా రు. వీటి విలువ రూ.23.80 లక్షలు. కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిన ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
