సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి టికెట్ ఫై 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యే గా ఎన్నికయి వచ్చే ఎన్నికలలో అక్కడ వైసీపీ టికెట్ పద్మశాలి లకు కేటాయిస్తున్నారని తెలిసి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్సీపీ గూటికి నేడు, మంగళవారం చేరిపోయారు. నేటి మధ్యాహ్నం పార్టీ అధినేత, సీఎం జగన్ కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరిపోయారు. సీఎం జగన్ సంతోషంతో కం డువా కప్పి ఆర్కే ను ఆలింగనం చేసుకొని పార్టీకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో వైఎస్సార్సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృ ష్ణారెడ్డి ఆవేశంతో రాజీనామా చేశారు. అయిన టీడీపీ కి విరోధినని చంద్రబాబు ఫై సుప్రీం కోర్టులో వేసిన కేసులు కొనసాగిస్తానని వెనక్కి తగ్గే ప్రశ్న లేదని ఆర్కే అప్పుడే చెప్పారు.ఆర్ కె ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్పార్టీలో చేరారు. పైగా షర్మిల తో పాటు ఆమె కుమారుడు వివాహానికి ఆహ్వానించడానికి సీఎం జగన్ నివాసానికి ఆర్కే వెళ్ళటం అక్కడ జగన్ ఆయనతో ఆత్మీయంగా మాట్లాడటం జరిగింది. మొత్తానికి తిరిగి పార్టీలోకి వచ్చిన ఆర్కే కు మంగళగిరి నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను జగన్ అప్పగించడం విశేషం..
