సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వందకు పైగా గోమాతలు మరణించిన కూడా టీటీడీ నిర్లక్ష్యంగా ఉందని మాజీ టీటీడీ చైర్మెన్, వైసీపీ నేత భూమన కరుణకర రెడ్డి చేసిన ఆరోపణలు దేశ్యవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే.. ఎట్టకేలకు 43 గోవులు మాత్రమే మాత్రమే మరణించాయని టీటీడీ ఇఓ అంగీకరించినప్పటికీ 100 పైగా గోవులు మరణించాయని తాను చూపిన ఫోటోలు నిజమని, నిజం నిరూపిస్తానని, నిరూపించలేకపోతే జైలు శిక్షకు కు పోతానని భూమన ఏ మాత్రం తగ్గడంలేదు. దానితో తిరుమల గోశాల వద్దకు నేడు, గురువారం భూమన వచ్చి నిజం నిరూపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరిన నేపథ్యంలో భూమన నేడు ఉదయం తిరుపతిలోని తన గృహం నుండి తిరుపతి ఎంపీ గురుమూర్తి తో. స్థానిక వైసీపీ నేతలతో సహా బయలు దేరుతున్న సమయంలో పోలీస్ లు అధికారులు అడ్డగించారు. గోవుల మరణాలు నిరూపించడానికి వెళుతుంటే మమ్మలిని అడ్డగించెదము ఏమిటి? అని పోలీస్ లను వైసీపీ నేతలు త్రోసుకొని ముందుకు వెళుతుంటే ఉద్రికత్త నెలకొంది. మరో ప్రక్క రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వారి పీఏలు, గన్ మేన్‌లు మాత్రం గోశాల వద్దకు రావచ్చని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని, ఒకే సమయంలో అధికార, ప్రతిపక్షాలు గోశాల సందర్శనకు వద్దని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు సూచించారు.ఇదిలా ఉండగా తాజగా కూటమి మంత్రులు, ప్రజా ప్రతినిధులు గోశాల సందర్శన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే భూమన ను గృహ నిర్బంధం చేసామన్న వార్తలను పోలీస్ వర్గాలు ఖండించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *