సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల తిరుపతి పరిధిలో ఎదో ఒక అనూహ్య ఘటనలు ప్రమాదాలు ఆస్థి నష్టాలు ప్రాణ నష్టాలు కొంతకాలంగా భక్తులను భయాందోనలు కు గురి చేస్తున్న నేపథ్యంలో తాజగా నేడు, గురువారం ఉదయం తిరుపతిలోని పవిత్ర శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి (Govindarajaswamy ) వీధిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు మొదలయ్యి చుట్టుప్రక్కల కు వ్యాపించి భారీ స్టయిల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనితో గోవిందరాజస్వామి ఆలయ పందిరి కొంత మేర దగ్ధం కావడంతో భక్తులు కలవరానికి గురి అయ్యారు. అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆలయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. .అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
