సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వాహనాల ద్వారా కొండపైకి వెళ్లే భక్తులతో పాటు మొక్కులు తీర్చుకొనేందుకు కాలినడకన వేలాది మంది భక్తులు కాలినడకగా అలిపిరి , శ్రీవారి మెట్టు మార్గాల్లో కొండపైకి ఎక్కి వస్తుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల దగ్గరకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో తాజగా టీటీడీ .కాలినడకన తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్‌ బస్సులను ఉచితంగా నడపడానికి ముందుకు వచ్చింది. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను ఉచితంగా దింపుతారు. అక్కడి నుండి వారు కాలినడకన కొండ ఎక్కావాల్సిఉంది. . ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో గతంలోనే ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *