సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్ ను అందరు చేస్తుండగా రెండు చెంపలు ఫై కొట్టారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఆ మహిళా సీఐ పరిధులు అతిక్రమించారంటూ.. మండిపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెపై చర్యలు తీసుకోకపోతే తానే స్వయంగా తిరుపతి వచ్చి పోలీస్ ఫై అధికారులకు పిర్యాదు చేస్తానని పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ నేడు, సోమవారం తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఫై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వ ర్రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుం చి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతి కి వాహనంపై నిలబడి తిరుపతికి వచ్చారు. దారి పొడవున ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ లతో భారీ దండలు వెయ్యడానికి పోటీ పడ్డారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యా లీగా పవన్ కళ్యాణ్ ఎస్పీ కార్యా లయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు.
