సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కాలం పగబూనిన తరహాలో ప్రతిరోజూ వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. తాజాగా నేడు, మంగళవారం ఉదయం తిరుపతిలోని నగరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.(car accident) వీరిలో ఇద్దరు తిరుచానూరు అమ్మవారి ఆలయ పోటు లో పనిచేసే స్టాఫ్ గా వారిని గుర్తించారు. కార్మికులు ఇద్దరు తిరుపతి నుంచి తిరుత్తనికి కారులో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నగరి మండలం తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో కారు డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
