సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లో భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. దానికి తోడు ప్రమాదాలలో భక్తులు మరణిసున్న ఘటనలు జరుగుతున్నాయి. దీనితో TTD ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా(insurance) సదుపాయం కల్పించాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నరు. ‘స్వామి దర్శనార్థం రోజూ సుమారు 70 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు మార్గం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతి చెందిన వారికి TTD రూ.3 లక్షల వరకు చెల్లిస్తోంది. ఇందులో భాగంగానే అలిపిరి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునే వరకు బీమాను కల్పించాలని టీటీడీ యోచిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
