సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు నేడు, ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాతుడు.. కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతుల విషయంలో ధరలు పెంచడమే ప్రభుత్వం పరమావధిగా మార్చుకుందని మండిపడ్డారు. ఇటీవల వసతి గదుల ధరలను రెట్టింపు కాదు మూడు రెట్లు పెంచడాన్ని బిజెపి తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. తిరుమల తిరుపతిలో ప్రస్తుతం ఉన్న వసతి సౌకర్యాలను మెరుగు పరిచామన్న సాకుతో ధరలు పెంచడం ఎంత వరకు న్యాయమో? భక్తులకు తిరుమలతిరుపతి పాలకమండలి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రూ.150 ధరలు వున్న ఒక్కో గదిని రూ.1700 పెంచారని ఇది మద్యతరగతి,సామాన్య భక్తులకు ఇబ్బందికరమేనని సోమువీర్రాజు అన్నారు.ఆ మధ్య అర్చన ధరలు భారీగా పెంచేశారు. హిందూ దేవాలయాల్లో మాత్రమే ధరలు పెంచడానికి ఉన్న ప్రభుత్వంగా వైసీపి కనపడుతోంది. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో ఒక్కో గది రూ. 750 నుండి రూ.1700 పెంచారంటే పాలక మండలి కాఠిన్యం హిందువులకు అర్ధం అవుతోందని సోమువీర్రాజు ఆరోపించారు వెంటనే పెంచిన ధరలను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు
