సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు గత రాత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో మాట్లాడుతూ.. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాతంతకు భంగం కలగకూడదు తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని ఆదేశించారు.. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడి అనుభవాల గురించి అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు.తిరుమల లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు అంటున్నారు. ఇది ఇలానే కొనసాగాలి, భక్తుల సలహాలు, సూచనలతో మరింత మెరుగ్గా సేవలు అందించొచ్చని పేర్కొన్నారు. ఒక్క తిరుమలలోనే కాక మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రక్కనే ఉన్న మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *