సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన తిరుమలలో అరుదైన బంగారు రంగుతలపిస్తూ పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమల లో మాత్రం గత బుధవారం సాయంత్రం బంగారు రంగు నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది. రెండడుగుల పొడవు మాత్రమే ఉన్న ఈ పాము పడగ విప్పి భక్తులకు కనిపించగా వారు పాము రంగు చూసి దేవత స్వరూపంగా భావించారు. దానితో అక్కడి సిబ్బంది పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కరనాయుడికి సమాచారమిచ్చారు.వెంటనే ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు. ఈ అరుదైన పాము నాగుపాము జాతికి సంబంధించినదేనని, అత్యంత విషపూరితమైనదని భాస్కర నాయుడు తెలిపారు.
