సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో వైభవంగా జరుగుతున్నా శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నేడు భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనానికి నేడు (మంగళవారం) భక్తులకు నేరుగానే అనుమతి లభిస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతోంది. ఇక గత సోమవారం 72,137 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
