సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలు ఏమి జరిగిందో.. అసలు ఏమి జరగలేదో? దోషులు ఎవరో? ‘సర్వానంతర్యామి’ ఏడుకొండలవానికి ఎరుక.. శతాబ్దాల తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పవిత్రమైన లడ్డు ప్రసాదంపై అతి ఉత్సహంతో అల్లరి మాత్రం బాగా జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నేటి సోమవారం ఉదయం చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరిగింది. ఈ రోజు పంచ్యగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళ మాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేస్తున్నారు.
