సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రత్య క్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నేడు, శనివారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి రధసప్తమి అందులో శనివారం రోజు కావడం తో తిరుమల నేటి తెల్లవారు జాము నుండి లక్షలాది భక్తులతో సందడిగా ఉంది. స్వామివారు సూర్యప్రభ వాహనం పై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ స్వామివారు సప్తవాహనాలపై దర్శనమిస్తున్నారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్యాలరీల్లో వాహన సేవలు తిలకించే భక్తులకు అధికారులు షెడ్లను నిర్మించారు. షెడ్ లలోనే భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పా ట్లు చేశారు.( up update photo)
