సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో ( శ్రీవారి ఆలయంలో రేపు (మంగళవారం) ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకురానున్నారు. అలాగే ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.అలాగే సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయంలోఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవారి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. అలాగే నిన్న (ఆదివారం) శ్రీవారిని 84,797 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 29,497 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ. 3.98 కోట్ల ఆదాయం లభించింది.
