సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నేడు, శనివారం ఉదయం 10 గంటల నుంచే ఆన్‌లైన్ ద్వారా జులై నెలకు సంబంధించి సుప్రభాతం, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాని విడుదల చేసింది.ఇక, శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల జులై నెల కోటాను వచ్చే సోమవారం ( ఏప్రిల్ 22) ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. . వర్చువల్ సేవలు కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. జులై కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత దర్శనం ఆదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *