సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భముగా కుమారుడు లోకేష్ కుటుంబ సభ్యులు తో కలసి నేడు, శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని గేట్లను మూసి వేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకీ భక్తులను ఎవర్ని అనుమతించలేదు. రెండు రోజులపాటు చంద్రబాబు తిరుమలలో పర్యటించనున్నారు.నేడు, వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
