సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తనకు ఎదురైన ఇబ్బందులపై పోరాటం జరిపి, అప్పటి టీడీటీ బోర్డు ఫై ధ్వజం ఎత్తిన తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరిగి జగన్ ప్రభుత్వం ఏర్పడినాక టీడీడి లో గౌరవపూర్వక స్థానం పొందిన విషయం తెలిసిందే.. అయితే ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో జరుగుతున్నా పరిణామాలు ఫై తన అసంతృప్తిని రమణ దీక్షితులు తాజగా తన ట్విటర్ లో వెల్లడిస్తూ .. తిరుమల లో అధికారుల తీరుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు…తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదు. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారు.’’ అని రమణ దీక్షితులు ట్విటర్లో కుండబ్రద్దలు కొట్టారు.
