సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాలతో భీమవరం పట్టణ టిడిపి ఆధ్వర్యంలో తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిపై స్థానిక పట్టణ పురవీధులలో కల్తీ నెయ్యి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పట్టణంలోని వివిధ దేవాలయాల చైర్మన్లు ధర్మకర్తలు దేవాలయాలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ .. గత వైసిపి ప్రభుత్వ హయాంలో హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలలో కల్తీ నెయ్యి కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై సమగ్ర విచారణ చేపట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశించిన సి.బి.ఐ సీట్ విచారణ అనంతరం పాలు లేకుండా పామాయిల్ ఇతర రసాయనాలతో కల్తి నెయ్యి తయారు చేయడం వాస్తవం అని నివేదిక కోర్టుకు సమర్పించారని ఆ నివేదిక లో కల్తీ నెయ్యి వాస్తవం కాదని వైసిపి శ్రేణులు అసత్య ప్రచారాలు చేయడానికి ఖండిస్తున్నామన్నారు..ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి ప్రసాద్, గనిరెడ్డి త్రినాథ్, గంటా త్రిమూర్తులు, మెరగాని నారాయణమ్మ, ఎండి షబీనా, పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, చెరుకుపల్లి సంతోష్ కుమార్,ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *