సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీటీడీ అదికారులు తీరుపై తాజగా నేడు, ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హిందువులకు కలియుగ వైకుంఠంగా భావించే పవిత్ర తిరుమల పరకామణిలో భక్తులు సమర్పించిన కానుకలు గతంలో రవికుమార్ అనే ఉద్యోగి చోరీ చేసిన కేసుపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. ఘటనపై కోర్ట్ సమయం ఇచ్చిన సరే కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పరకామణిలో చోరీ పై కౌంటర్ దాఖలు చేసేందుకు మరల సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయమిస్తూ ఈనెల 27కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *