సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు నేడు, గురువారం రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. జిల్లా కలెక్టర్, ఎస్పీపై, అలాగే టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.భక్తులు ఇంతభారీగా వస్తారని తెలిసిన కూడా, ఇంత భారీ స్థాయి యంత్రాగం ఉండి కూడా టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ఎన్ని టికెట్లు జారీ చేశారు…త్రొక్కిసలాట జరుగుతుంటే ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ? వరుసగా సీఎం ప్రశ్నలు సంధించారు. ఇది క్షమించరాని తప్పు జరిగింది. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు. బాధ్యత తీసుకున్నవారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు’’ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.అంటూ కలెక్టర్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం చంద్రబాబు ఆసుపత్రిలో మృతుల, బాధితుల కుటుంబాలను పరామర్శించారు. అన్ని రకాలుగా ప్రభుత్వం అండ గా ఉంటుందని వారికీ భరోసా ఇచ్చారు. తమిళనాడు సేలం కు చెందిన భక్తురాలు మల్లిక త్రొక్కిసలాటలోనే మరణిస్తే పోలీసులు మాత్రం అనారోగ్యంతో మరణించిందని ప్రకటించడం ఫై ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే 7 గురు మృతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *