సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో ఇకపై ఈ డిసెంబర్ నెల నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో శ్రీవారి.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. బ్రేక్ దర్శనాలు రద్దైన చేసిన రోజులివే.. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, మరియు జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. పైన పేర్కొన్న రోజుల్లో ముందురోజు వచ్చే వీఐపీ దర్శ నాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *