సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీకి కానీ గత 10 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి కానీ చేదోడు వాదోడు గా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఎంపీగా నరసాపురం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి పవన్ తన సోదరుడు నాగబాబుని కూడా ఎక్కడా నిలబెట్టలేదు. అయితే అనకాపల్లి నుండి జనసేన పార్లమెంటు అభ్యర్థిగా నాగబాబు పోటీ చెయ్యాలని భావించినకాని అనూహ్యంగా నాగబాబుకు బదులు ఆ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడం, అక్కడ నుండి సీఎం రమేష్ పోటీ చేసి గెలవటం అవన్నీ తెలిసిన విషయాలే.అయితే ఇప్పుడు నాగబాబు కి ఏదైనా ఒక కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలిసింది. అందుకే రాష్ట్రంలో అతి ముఖ్యమైన కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలిసింది. టీటీడీ లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకు ఎంతో ప్రక్షాళన చెయ్యాల్సి ఉందని, అందుకోసమే నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తరువాత నాగబాబుని టీటీడీ చైర్మన్ గా చేస్తూ అధికారిక ప్రకటన వెలువడవచ్చు అని సమాచారం.
