సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా అందమైన స్వామివారి చిత్రాలతో మంచి క్వాలిటీతో ముద్రించిన 2023వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.. నేటి సోమవారం నుండి తిరుపతి, తిరుమలలోని తితిదే పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచినట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని టీటీడీ అన్ని అనుబంధ ఆలయాలలో వీటిని విక్రయించడానికి ఏర్పాట్లు చేసారు. అలాగే క్యాలెండర్లు, డైరీలను భక్తులు tirupatibalaji. ap.gov.in వెబ్సైట్లో పబ్లికేషన్స్ ను క్లిక్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు . తపాలాశాఖ ద్వారా భక్తుల ఇంటివద్దకే అందిస్తున్న ట్లు టీడీపీ ప్రకటించింది. ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ ద్వారా కూడా భక్తులకు టీటీడీ క్యాలెండర్, డైరీలను పంపుతారు. రవాణా ఛార్జీలు అదనం గా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తీ వివరాలకు 99639 55585, 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు..
