సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న ‘తిరుమల’ తిరుపతి చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా కనీవినీ ఎరుగని విషాదం చోటు చేసుకోవడం పట్ల దేశ ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ , దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక తిరుపతి వైకుంఠ ద్వారం దర్శనం టోకెన్ ల కోసం ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలలో విషాదం ఎవరు తీర్చలేనిది. టోకెన్ టికెట్స్ ఇచ్చేటప్పుడు పాటించవలసిన వ్యూహరచన పాటించని ప్రభుత్వ యంత్రాంగం, భక్తులకు రక్షణ కల్పించలేని అసమర్ధత ఫై మొత్తం టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి. ఐదుగురు మహిళలుతో పాటు ఓ వ్యక్తి మృతి చెందిన ఈ దుర్ఘటనలో మృతుల వివరాలు.. విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తమిళనాడు కు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబుతొక్కిసలాటలో మృతి చెందారు. క్షతగాత్రుల వివరాల కోసం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08772236007 ఏర్పాటు చేసారు
