సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి దర్మనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో పలు పట్టణాలలో ఉన్న టీటీడీ పరిధిలోని ఆలయాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డుని విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు త్వరితంగా దివ్య దర్శనం టోకెన్ల విధానాన్ని త్వరలోనే పున:ప్రారంభిస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్4న ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8వ తేదీన గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి.
