సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో విజయవంతంగా ముగిశాయి. నిరాటంకంగా బ్రహ్మోత్సవాలు టీటీడీ నిర్వహించిందని టీడీడి ఛైర్మన్ బీఆర్ నాయుడు నేడు, గురువారము మీడియాతో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, గతంలో ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో రూ. 25.12 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.అని తెలిపారు. 28 లక్షల లడ్డూలు, 26 లక్షల అన్నప్రసాదాలు భక్తులకు అందించారు. తీరు విధులలో సాంస్కృతిక ప్రదర్శనలు, అలంకరణలు భక్తులకు శ్రీ మహావిష్ణు తో వైకుంఠము లో ఉన్న అనుభూతి కల్పించాయి.
