సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునితో అవినీతి ఆటలా? నిజంగా శ్రీవారి లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేసి, క్షమించరాని తప్పు చేసి ఎవరైనా ఈ భూమి ఫై ఉంటారా ? రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది ప్రపంచవ్యాప్తంగా హిందూ వాదులను వేధిస్తున్న ప్రశ్న .. తిరుమల తిరుపతి దేవస్థానంకి EO గా గతంలో ఐవైఆర్ కృష్ణారావు IAS. సుదీర్ఘ కాలం పనిచేసి అబివృద్ధి లో .. భక్తులకు సులభ దర్శనల ఏర్పాటులో తనదయిన ముద్ర వేశారు. పైగా గతంలో ఏపీలో సీఎం చంద్రబాబు హయాంలో ప్రభుత్వ మాజీ సీఎస్ గా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర బీజేపీ లో కీలక నేతగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు నేడు, శనివారం తిరుమల లడ్డు వివాదం ఫై ఒక వీడియో విడుదల చేసారు ఆయన మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠం.. టీడీడీ ఇఓ గా గత నా అనుభవంతో చెపుతున్నాను. తిరుమల ప్రసాదాల్లోగత ప్రభుత్వం జంతువుల నూనె కలిపి తయారు చేసిందని సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణల్ని తాను నమ్మడం లేదని అన్నారు. ఇలాంటిది జరిగి వుండదనే నేను అనుకుంటున్నా .. అయితే తిరుమల ప్రసాదం పై అత్యున్నత రాజకీయ స్థాయిలో ఆరోపణ వచ్చింది. కావున సమగ్ర విచారణ చేసి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఒకవేళ ఆరోపణల్లోనిజం లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది శ్రీవారి లడ్డు ఫై చాలా తీవ్రమైన ఆరోపణ. భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఆరోపణ వాస్తవం కాకపోతే క్షమాపణతో స్వస్తి పలకాలి” ఇదీ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *