సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ల్ : పవిత్ర తిరుమల లడ్డు లో జంతు కొవ్వులు వినియోగించలేదని అయితే పామాయిల్ తో మిశ్రమాన్ని వినియోగించారని కేంద్ర సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నివేదిక చార్జిషీట్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు, మరి కొందరు మేధావులు విశ్లేషకులు పెద్ద ఎత్తున చంద్రబాబు, పవన్ లు గతంలో చేసిన ప్రచారం ఫై పెద్ద ఎత్తున మండిపడుతుండటంతో.సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో దానిని త్రిప్పి కొట్టే ప్యూహంలో భాగంగా , తాజగా నేడు, గురువారం ఉదయం అమరావతిలో పవన్ తో మరి కొందరు క్యాబినెట్ మంత్రులతో సమావేసం అయ్యిన సీఎం చంద్రబాబు తదుపరి మీడియా ముఖంగా .. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై మరోసారి విచారణకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ విషయంలో తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హయాంలో తప్పులు చేసి.. తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దుర్మార్గాలు చేసి తిరిగి తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైసీపీ నేతల తీరుఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. భక్తులు తిరుమలకు రావాలంటేనే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు. వైసీపీ వాళ్లు.. తనతోనే కాకుండా దేవుడితోనూ పెట్టుకున్నారని తెలిపారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని విమర్శించారు.
