సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల విజన్‌తో ప్రత్యేక ప్రణాళికని రూపొందిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు నేడు,ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. నిపుణులైన కంపెనీలతో చర్చించి తిరుమల విజన్ ప్లాన్‌ని తయ్యారు చేస్తామని అన్నారు. కాలినడక మార్గాలు సరిగ్గా లేవు..వాటిని అభివృద్ధి చేయాలన్నారు. తిరుమలలో మల్టీ లెవల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తరోడ్డులు,లింక్ రోడ్ల విస్తరణ చేయాలన్నారు. బస్టాండు మార్పు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న 42 ఎకరాల్లో బెస్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలకు వాహనాలు అధికంగా వస్తున్నాయని…వీటిని నియంత్రించాలని అన్నారు. హిందువులు కానీ వారు టీటీడీ బోర్డులో అన్యమత ఉద్యోగులుగా కొనసాగితే వారిని ఇతర శాఖలకు పంపడం..లేక వీఆర్ఎస్ ఇప్పిస్తామన్నారు. ప్రసాదాల తయ్యారికి నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని చెప్పారు. త్వరలోనే టీటీడీ నూతన ల్యాబ్ అందుబాటులోకీ వస్తుందని తెలిపారు. టీటీడీ క్రింద 61 ఆలయాలు ఉన్నాయి..వాటిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆకాశగంగ,పాపవినాశనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్ట్‌లో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ద్వారా యువతలో భక్తి భావన పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
