సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కి భక్తులతో పాటు ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో జూన్ వరకు రూ. 670 కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం గత జూలై నెలలో రికార్డు స్థాయిలో మరో రూ 125.35 కోట్లు జమైంది. ఇంకా అదనంగా వెలకట్టలేని బంగారు, వజ్ర ఆభరణాలు కానుకలు వెంకన్న సొంతం కాగా జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది. ఇక గత జులై మాసంలో శ్రీవారికి మరో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం దక్కడం విశేషం. 2022 మార్చి నెల నుంచి వరుసగా గత 29 మాసాలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లకు పైగానే ఉంటోంది
