సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శుక్రవారం ఉదయం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారన్నారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నానన్నారు. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని.. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. తదుపరి అమరావతి సమీపంలోని ఉండవల్లి లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకొంటున్నారు. జైలు నుండి బెయిల్ ఫై బయటకు వచ్చాక హైదరాబాద్ వెళ్ళిపోయిన చంద్రబాబు తిరిగి తొలిసారి ఏపీలోని టీడీపీ కీలక నేతలతో శ్రేణులతో నేడు, ఉండవల్లిలో తన నివాసంలో ఈ బేటీ నిర్వహిస్తున్నారు. 2న ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం ప్రకటించిన నేపథ్యంలో.. పార్లమెంటరీ నేతలతో డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
