సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ సీఎం పడవి అధిష్టించాక తొలిసారి రేవంత్ రెడ్డి తొలిసారి తన కుటుంబసభ్యులతో కలిసి నేడు, బుధవారం ఉదయం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి ఆలయ మర్యాదలతో శ్రీవారి దర్శనం చేయించారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుం బసభ్యు లతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేను. ఏపీలో ఏర్పడే ప్రభుత్వం తో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా.. తిరుమల లో తెలంగాణ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలతో ఒక భవనం నిర్మించే యోచన ఫై త్వరలో ఏపీ ని కలవబోతున్నాము. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సం తోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించాను అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *