సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో భాగంగా కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకొని భక్తులు ఎక్కువ కావడంతో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన విధానాల్లో టీటీడీ అధికారులు పలు మార్పులు చేశారు. శ్రీ శ్రీనివాసుని మూల విరాట్‌కు పూజా కైంకర్యాల నిర్వహణలో సమయం వృధా కాకుండా పూజాది కార్యక్రమాలు నిర్వహించేలా అర్చకులకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు, వారాంతాల్లో విచక్షణ కోటాలో జారీ చేసే సుప్రభాత సేవ దర్శన టిక్కెట్లను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ప్రతి గురువారం రోజున ఏకాంతంగా నిర్వహించే తిరుప్పావడి సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తుల ను దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
