సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయం చుట్టూ అంగ ప్రదక్షణ చేస్తే జీవితం ధన్యం అవుతుందని భావించే భక్తుల కోసం నేడు, మంగళవారం తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వచ్చే ఫిబ్రవరి కోటా అంగ ప్రదక్షిణ టికెట్లను.. నేటి మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టికెట్లను కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని తెలిపింది.
