సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. దీనిలో – లక్కీడిప్ రిజిస్ట్రేషన్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకొనే అవకాశం ఉంది. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే యాత్రికులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ స్టష్పం చేసింది. ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 22న, వర్చువల్ సేవలు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. అయితే శ్రీవాణి ట్రస్టు దర్శనం 23న ఉదయం, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శనం 23న మధ్యాహ్నం, ప్రత్యేక ప్రవేశ దర్శనం 24న ఉదయం, గదుల కోటా 24న మధ్యాహ్నం విడుదల అవుతాయి.ఇకపోతే, గదుల కోటాకు సంబంధించి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవా టికెట్లతో పాటు వసతి గదుల కోటా కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది టీటీడీ. తిరుమల తోపాటు తిరుపతిలో కూడా వసతి టీటీడీ గదుల కోసం సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
