సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ వంటి సేవలకోసం ఆన్ లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటారు. అయితే, టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది.భక్తుల ఆధార్ ఆథెంటికేషన్ అనుమతి కోసం గతేడాది జులైలో దేవాదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఆ లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. గత ఆగస్టులో కేంద్రం నుంచి అనుమతి లభించింది. దానిపై నవంబరు 18న టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు నోటిఫికేషన్ ను తాజగా గెజిట్ లో ప్రచురించారు.ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు వల్ల శ్రీవారి దర్శనానికి ఒకరి పేరుతో మరొకరు రాకుండా నిరోధించేందుకు, సేవలు పొందేటప్పుడు తనిఖీ ప్రక్రియ జరగనుంది. దీనితో కుటుంబాలతో వెళ్లే వారికీ కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు..
