సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసే భక్తులు మధ్యలో దళారీల , మోసగాళ్ల భారిన పడకుండా ఉండాలంటే ఈ ఆన్ లైన్ సేవలు ఏవైనా సమస్యలు ఎదురైతే వివరాలు కోసం ఈ క్రింది సమాచారం ఉపయోగించు కోవలసి ఉంటుంది. శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల కోసం ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లోనే నమోదు చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఈ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. టీటీడీ అధికారుల అధికారిక ఈ మెయిల్ ఐడీలు.. టీటీడీ ఈవో: eottd@tirumala.org, eottdtpt@gmail.com టీటీడీ అదనపు ఈవో: jeotml@tirumala.org తిరుపతి జేఈవో: jeotpt@tirumala.org లను సంప్రదించవచ్చును. వీఐపీ బ్రేక్ దర్శనం, సిఫార్సు లేఖలను తితిదే ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీటీడీ ఉద్యోగుల వద్ద నేరుగా తీసుకోవడం ద్వారా దళారుల బారిన పడకుండా తప్పించుకోవచ్చను. శ్రీవారి దర్శనం, వసతితోపాటు మరే ఇతర సందేహాలు అయినా నివృత్తి చేసుకునేందుకు టీటీడీ టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 1800-4254141 లేదా 155257కు ఫోన్ చెయ్యాలి. అలాగే తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్- 94407 96769 తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్- 94407 9677లను మీ అవసరాలకు వినియోగించుకోవచ్చు,
