సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నా నేపథ్యంలో విధులలో భాగంగా ,,నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారి నడకదారి ని క్షుణంగా పరిశీలిస్తూ మెట్లు ఎక్కుతున్న ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(59) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అప్పటికే 1,805మెట్టు ఎక్కి అక్కడ కుప్పకూలి పోయారు. ఆస్పత్రికి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ స్వ స్థలం విజయవాడ సమీపం లోని పోరంకి. ఈ ఘటనపై కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చి కర్తవ్య నిర్వహణలో కనుమూసిన ఆయనకు ఘన నివాళ్లు అర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *