సిగ్మాతెలుగు డాట్ ఇన్
: కొత్త ఏడాదిజనవరి లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకి డిమాండ్
మాములుగా లేదు. . టీటీడీ ఆన్‌లైన్‌లో నేడు, శుక్రవారం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేసింది. ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కి 14 లక్షల హిట్లు వచ్చాయి. అయినా టికెట్ల కేటాయింపు ప్రక్రియ సాఫీగా సాగింది. 55 నిముషాల వ్యవధిలోనే 4 లక్షల 60 వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. కాగా, జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు, 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12 వేలు చొప్పున దర్శన టికెట్లను విడుదల చేసింది. కాగా, జనవరికి సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ నిన్న గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, కొద్దీ నిమిషాల వ్యవధిలోనే `బుకింగ్ పూర్తిఅయింది.
