సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో వచ్చే సెప్టెంబర్ నెల 18వ తేదినుండి 26వ తేదీవరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నేడు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రంగ వైభవంగా జరిగే వేడుకలలో భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల సౌకర్యాల కోసం జర్మన్ షెడ్లుని వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్ 18న సీఎం జగన్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. రద్దీ ఎక్కువ ఉండే గరుడ సేవ రోజున ద్విచక్ర వాహనాలకు కొండమీదకి అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. 9 రాష్ట్రాల నుంచి కళా బృందాలు వస్తున్నాయన్నారు. ఉదయం 8 గంటలకు రాత్రి 7 గంటలకు వాహన సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంత ప్రజలకు బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తామని చెప్పారు. క్రూరమృగాల సంచారం నేపథ్యంలో అటవీశాఖ ఇచ్చే నివేదిక మేరకు భక్తులకు నడక మార్గంలో నిభందనలు సడలిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు
